
విజయవాడ సెంట్రల్లో వైసీపీ చేపట్టిన నిరాహార దీక్షా శిబిరంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఘర్షణలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారని సమాచారం.
వైసీపీ నేత పేర్ని నాని ఈ దాడిని ఖండించగా, టీడీపీ నేతలు తమ నిరసనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.