
రిటైల్, బల్క్ డీజిల్ ధరల మధ్య లీటరుకు రూ.40 వరకు వ్యత్యాసం ఉండటంతో పారిశ్రామిక వినియోగదారులు పెట్రోల్ బంకుల వైపు మళ్లుతున్నారు.
ఇంధన సరఫరాపై ఒత్తిడి పెరగడంతో జియో-బీపీ రోజుకు గరిష్టంగా 50 లీటర్లు, నయారా ఎనర్జీ 70 నుంచి 200 లీటర్ల వరకు మాత్రమే డీజిల్ విక్రయిస్తున్నాయి.
సాధారణ వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పంపిణీని క్రమబద్ధీకరించేందుకే ఈ పరిమితులు విధించినట్లు సంస్థలు తెలిపాయి.