
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీ డివిజన్ వన్డే లీగ్‌లో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ 126 పరుగులతో అజేయ శతకం సాధించారు.
సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఆడిన ఆనంద్ 82 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్సర్లతో ఈ ఘనతను అందుకున్నారు.
వర్షం కారణంగా వీజేడీ పద్ధతిలో సికింద్రాబాద్ క్లబ్ విజేతగా నిలవగా, బౌలింగ్‌లోనూ ఆనంద్ 5 ఓవర్లలో కేవలం 8 పరుగులు ఇచ్చారు.