
నార్త్ కరోలినాకు చెందిన జేమ్స్ గేట్స్ తన భార్య తనను హత్య చేసేందుకు చాట్‌జీపీటీ సాయం తీసుకుందని ఆరోపిస్తూ ఓపెన్ఏఐ సంస్థపై కోర్టులో కేసు వేశారు.
భార్య విషప్రయోగం గురించి చాట్‌బాట్‌ను సంప్రదించిందని, అది ఆమె అనుమానాలను పెంచి విషపూరిత పదార్థాల ప్రభావాలపై సమాచారం ఇచ్చిందని జేమ్స్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
భార్యపై గతంలో నమోదైన హత్యాయత్నం కేసు ఆధారాలు లేవని ఏప్రిల్ 2026లో కొట్టివేయగా, ఇప్పుడు భద్రతా లోపాలపై జేమ్స్ చట్టపరమైన పోరాటం చేస్తున్నారు.