
హైదరాబాద్లో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా విగ్రహాల గరిష్ట ఎత్తును 16 అడుగులకు పరిమితం చేయాలని సీపీ వీసీ సజ్జనార్ తయారీదారులను ఆదేశించారు.
గతేడాది విగ్రహాల రవాణాలో నాలుగు ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో, ఈసారి రవాణాకు ముందు ట్రాఫిక్ పోలీసుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘించే తయారీదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఫైర్ సేఫ్టీ, విద్యుత్ వైరింగ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సీపీ హెచ్చరించారు.