
ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ రోలర్ స్కేట్ కాంపిటీషన్ 2026లో నారాయణ స్కూల్స్ విద్యార్థిని ఖుషి రాజేష్ రజత పతకం సాధించింది.
స్పీడ్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SSFI) ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో అండర్-10 విభాగంలో 400 మీటర్ల రిక్రియేషనల్ ఇన్-లైన్ రేసులో ఖుషి ఈ విజయాన్ని అందుకుంది.
భారత్, ఇండోనేషియా సహా 5 దేశాల నుండి 1,000 మంది పాల్గొన్న ఈ పోటీలలో రజతం సాధించిన ఖుషికి నారాయణ స్కూల్స్ రూ.10,000 నగదు బహుమతిని ప్రకటించింది.