అనంతపురం జిల్లా రాప్తాడులో బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన హేమంత్‌ను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉన్న హేమంత్ పారిపోయేందుకు ప్రయత్నించి, సీఐపై కత్తితో దాడి చేయడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి హెచ్చరించారు, అయినా అతను వెనక్కు తగ్గకపోవడంతో 6 రౌండ్లు కాల్పులు జరిపారు.
దాడిలో తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను అనంతపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు, బాలికను మెరుగైన వైద్యం కోసం బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.