
బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్‌తో సమావేశమైన ప్రధాని మోదీ, ఆర్థిక, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించే అంశాలపై చర్చించారు.
మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జరిగిన భేటీలో సెమీకండక్టర్ రంగం, కీలక ఖనిజాలు, స్వచ్ఛమైన ఇంధన వనరులు వంటి భవిష్యత్ అవసరాల రంగాల్లో సహకారాన్ని పెంచాలని నిర్ణయించారు.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో భేటీలో పశ్చిమాసియా ఉద్రిక్తతలు, చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ పురోగతిపై ఇరు నేతలు చర్చలు జరిపారు.