
జీవో 97ను వ్యతిరేకిస్తూ హన్మకొండ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టిన బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణలో ప్రజాపాలన పేరుతో పోలీస్ పాలన సాగుతోందని, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఈ అరెస్టుతో హన్మకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.