
మహారాష్ట్రలోని ధులే జిల్లా తాపీ నదిలో కాళ్లకు ఇనుప గొలుసులు కట్టి తాళం వేసిన స్థితిలో నవ దంపతుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
మృతులను జలగావ్ జిల్లాకు చెందిన శ్యామ్‌హరి పాటిల్, స్వప్న పాటిల్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
కొన్ని నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న వీరు ఆత్మహత్య చేసుకున్నారా లేక హత్యకు గురయ్యారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.