
అమరావతిలో 730 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో క్వాంటమ్-ఏఐ డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది.
వచ్చే నెల 13 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభం కానున్నాయని అధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ఐదేళ్లలో 8,250 మంది విద్యార్థులకు క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, చిప్ డిజైన్ వంటి రంగాల్లో శిక్షణ అందించనున్నారు.