పురుషుల జూనియర్ ఆసియా కప్‌లో భారత్ వరుసగా నాలుగోసారి ఛాంపియన్‌గా నిలిచింది.
ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో దక్షిణ కొరియాపై 4-1 గోల్స్ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
ఈ టోర్నీలో భారత్‌కు ఇది మొత్తంగా ఆరో జూనియర్ ఆసియా కప్ టైటిల్ కావడం విశేషం.