
మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన టీమ్ ఖండించింది.
ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఇటువంటి రూమర్లను అభిమానులు, ప్రజలు నమ్మవద్దని స్పష్టం చేసింది.
ధ్రువీకరించని ఇటువంటి అసత్య వార్తలను దయచేసి ఇతరులతో పంచుకోవద్దని చిరంజీవి వ్యక్తిగత బృందం అధికారికంగా కోరింది.