
కెన్యాలోని సలామా ఏరియా నైరోబి–మొంబాసా హైవేపై శనివారం తెల్లవారుజామున లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వ్యాన్ను ఢీకొనడంతో 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘోర ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులంతా ప్రార్థనా స్థలానికి వెళ్తున్న క్యాథలిక్ క్రైస్తవులుగా గుర్తించగా, ఘటనపై కెన్యా అధ్యక్షుడు విలియం రుటో సంతాపం వ్యక్తం చేశారు.