
భుజం గాయంతో సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఎన్టీఆర్కు వైద్యులు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన త్వరలోనే పునరావాస కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
వైద్యుల అంచనా ప్రకారం ఎన్టీఆర్ దాదాపు 2 నుంచి 3 నెలల వ్యవధిలో పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి వస్తారు.