
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బుధవారం విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు అక్టోబర్ 28న పోలింగ్ జరుగనుండగా, అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
షెడ్యూల్ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎస్ఈసీ ప్రకటించారు.