
ఆహార భద్రత ప్రాధికారిక సంస్థ (ఎఫ్డీఏ) వృక్షసంబంధిత కొవ్వులు, మైదా, స్టార్చ్తో తయారుచేసే అనలాగ్ పన్నీర్ తయారీ, నిల్వ మరియు విక్రయాలపై ఏడాది పాటు నిషేధం విధించింది.
ఈ నిషేధాన్ని ఉల్లంఘించే రెస్టారెంట్లు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనలు అతిక్రమిస్తే 6 నెలల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష మరియు రూ. 10 లక్షల జరిమానా ఉంటుందని హెచ్చరించారు.
అనలాగ్ పన్నీర్ వాడకం వల్ల గుండె సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్ పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.