
మన ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి రక్తపోటు, షుగర్ లెవెల్స్ మాత్రమే కాకుండా కళ్లు, చెవులు కూడా కీలకమైన సూచికలని ఆధునిక వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
బ్రిటన్‌లో 30,000 మంది ఆరోగ్యవంతులపై జరిపిన అధ్యయనంలో రెటీనాలోని నరాల పొర పలుచగా ఉన్నవారిలో జ్ఞాపకశక్తి, తార్కిక సామర్థ్యాలు క్షీణించే ప్రమాదం రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
వినికిడి లోపం వల్ల మాటల్లో స్పష్టత కొరవడి, దానిని అధిగమించేందుకు మెదడు తన శక్తిని ఎక్కువగా వినియోగించాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.