
భారత వైమానిక దళంలో నాన్-మెడికల్ విభాగంలో 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన మొదటి మహిళా అధికారిగా శక్తి శర్మ చరిత్ర సృష్టించారు.
జూన్ 18, 1994న ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లో చేరిన ఆమె, ప్రస్తుతం 'అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (ఎడ్యుకేషన్)'గా బాధ్యతలు స్వీకరించారు.
గతంలో కపూర్తలా సైనిక స్కూల్‌కు ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ఆమె, ఐఐటీ కాన్పూర్, పుణె యూనివర్సిటీలలో 'IAF చైర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.