
కార్తీ హీరోగా నటించిన 'సర్దార్ 2' చిత్రం వచ్చే శుక్రవారం పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.
2022లో వచ్చిన మొదటి భాగం హిట్ కావడంతో రూపొందించిన ఈ సీక్వెల్ లో ఎస్.జె. సూర్య విలన్ గా నటించగా, మాళవిక మోహన్, ఆషిక రంగనాథన్ హీరోయిన్లుగా నటించారు.
చెన్నైలో జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సూర్య, ఈ సినిమా టీజర్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు.