
అహ్మదాబాద్‌లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత పారా ఆర్చర్ శీతల్ దేవి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.
ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన ఐజాదా సీదాన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో ఇద్దరూ 144-144తో సమంగా నిలవడంతో నిర్వహించిన షూట్‌ఆఫ్‌లో శీతల్ విజయం సాధించింది.
ఇదే టోర్నీలో శీతల్ దేవి, తోమన్ కుమార్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ఇరాక్ జోడీని ఓడించి కాంస్య పతకాన్ని కూడా సాధించారు.