
ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై 200 శాతం నమ్మకం కలిగిన తర్వాతే వారిని జాతీయ జట్టులోకి ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.
అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్ జట్టులో నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్ల పేర్ల పక్కన అస్టరిస్క్ మార్క్ ఉంచడం ఈ కొత్త విధానంలో భాగమే.
గాయాల నుంచి కోలుకుంటున్న ఆటగాళ్లను తొందరపడి మైదానంలోకి దించకుండా, వైద్య బృందం నిర్ధారణ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేసింది.