
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు.
అసెంబ్లీ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పకుండా హాజరై ప్రతి చర్చలో పాల్గొనాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
శాసనసభ, మండలిలో జరిగే చర్చల్లో పార్టీ తరపున గట్టిగా వాదనలు వినిపించాలని ఆయన నేతలకు సూచించారు.