
అమెరికా డైవర్సిటీ వీసా లాటరీ రిజిస్ట్రేషన్ను తిరిగి ప్రారంభించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని ఫెడరల్ కోర్టు ఆదేశించింది.
కాలిఫోర్నియా ఫెడరల్ న్యాయమూర్తి జిన్సూక్ ఓహ్తా అక్టోబర్ 14న ఈ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ లాటరీ ద్వారా అర్హులైన ఇతర దేశాల పౌరులకు ఏటా గరిష్ఠంగా 55 వేల వలస వీసాలు అందించే అవకాశం ఉంటుంది.