
రాబోయే 20 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా జాబ్ మార్కెట్‌లో పెను మార్పులు సంభవిస్తాయని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హెచ్చరించారు.
టెలిఫోన్ సేల్స్, కస్టమర్ సపోర్టు, అకౌంటింగ్ వంటి ఉద్యోగాలు ఏఐ కారణంగా కనుమరుగవుతాయని ఆయన తెలిపారు.
కేవలం కార్యాలయాలే కాకుండా శారీరక శ్రమ అవసరమైన రంగాల్లోనూ రోబోటిక్స్ పాత్ర పెరుగుతుందని గేట్స్ పేర్కొన్నారు.