
ఇరాన్‌లోని కుర్దెస్థాన్ ప్రావిన్స్‌లో సనందజ్-హమెదాన్ రహదారిపై ఇంధన ట్యాంకర్ ఇతర వాహనాలను ఢీకొని పేలిపోవడంతో 11 మంది అక్కడికక్కడే మరణించారు.
ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
పేలుడు ధాటికి సమీపంలోని పలు కార్లకు మంటలు వ్యాపించాయని, ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక మీడియా పేర్కొంది.