
రాష్ట్రంలోని 22A నిషేధిత భూముల జాబితాపై సమగ్ర విచారణ జరుపుతామని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు.
గత ప్రభుత్వ హయాంలో యాదగిరిగుట్టలో 42 వేల ఎకరాలను ఉద్దేశపూర్వకంగానే నిషేధిత జాబితాలో చేర్చారని, దీని వెనుక కుట్ర ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
సీఎం అమెరికా పర్యటన ముగిసిన తర్వాత ఈ అంశంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని, బాధితులు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.