
ఉదయం సూర్యరశ్మి శరీర జీవ గడియారాన్ని క్రమబద్ధీకరించడానికి, నిద్రకు తోడ్పడటానికి ఉపయోగపడుతుందని డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు.
విటమిన్ డి ఉత్పత్తికి మాత్రం మధ్యాహ్నం 11 నుంచి 1:30 గంటల మధ్య లభించే UVB కిరణాలు ప్రభావవంతంగా ఉంటాయని పేర్కొన్నారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో ఎక్కువసేపు బయట ఉండటం వల్ల చర్మం కాలిపోవడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.