నీట్ పరీక్ష ఒత్తిడి కారణంగా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం విద్యా వ్యవస్థలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోంది.
మరణానికి ముందు రాసిన లేఖలో విద్యార్థి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరారు.
ఈ ఘటనపై విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి, పరీక్షల నిర్వహణలో మార్పులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.