
భూమి, ఆస్తి హక్కు వంటి సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, సెటిల్మెంట్లు చేయడానికి ప్రయత్నించడం రాజ్యాంగ విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చిచెప్పింది.
పౌరుల మధ్య ఆస్తి వివాదాలను పరిష్కరించే బాధ్యత సివిల్ కోర్టులు మరియు చట్టబద్ధమైన ఫోరమ్‌లకు మాత్రమే ఉంటుందని జస్టిస్ కుంచం మహేశ్వరరావు వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు 222 మంది పోలీసులు ఉండాలని ఐక్యరాజ్యసమితి సిఫారసు చేయగా, ఏపీలో ఆ నిష్పత్తి 166.18గా మాత్రమే ఉందని హైకోర్టు గుర్తుచేసింది.