
ఆఫ్రికాలోని జిబూటి నుంచి యెమెన్‌కు వలసదారులతో వెళ్తున్న పడవ గుహెరే ప్రాంతానికి సమీపంలో ప్రమాదవశాత్తు బోల్తా పడింది.
ఈ దుర్ఘటనలో 15 మంది పిల్లలు సహా మొత్తం 109 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 116 మందికి పైగా గల్లంతయ్యారు.
ప్రమాదం నుంచి 80 మందికి పైగా ఇథియోపియా పౌరులు సురక్షితంగా బయటపడగా, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.