
సుదీర్ఘకాలంగా విధులకు అనధికారికంగా గైర్హాజరైన 70 మంది ప్రభుత్వ వైద్యులను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తొలగించింది.
ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన నివేదికను శుక్రవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు అధికారులు అందజేశారు.
ఇదే రీతిగా వ్యవహరిస్తున్న మరో 193 మందిపై చర్యలు తీసుకునేందుకు సంబంధించిన ఏర్పాట్లు వివిధ దశల్లో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.