చైనా తన పశ్చిమ ఎడారి ప్రాంతంలోని లోప్ నూర్ సైనిక స్థావరాన్ని నెక్స్ట్-జెన్ ఫైటర్ జెట్ల పరీక్షల కోసం శరవేగంగా విస్తరిస్తోంది.
ఆగస్టు 2025 నుండి చేపట్టిన ఈ విస్తరణలో భాగంగా నాలుగు భారీ హ్యాంగర్లు, కొత్త టాక్సీవేలు, ఇంధన నిల్వ కేంద్రాలను నిర్మించారు.
ఈ స్థావరంలో J-36, J-50 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలను చైనా పరీక్షిస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి.