
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ల నిర్మాణానికి సంబంధించి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పూర్తయింది.
ఆనందపురం మండలం తర్లువాడలో 266.69 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో 159.24 ఎకరాలను వేర్వేరు కంపెనీల పేరున సేల్ డీడ్ చేశారు.
వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ రెండు డేటా సెంటర్ల కోసం రూ.87,520 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు.