
తెలుగు చిత్ర పరిశ్రమను లక్ష్యంగా చేసుకుని డీప్‌ఫేక్ వీడియోలు, నెగెటివిటీని వ్యాప్తి చేస్తున్న సోషల్ మీడియా ఖాతాల వివరాలను సేకరిస్తున్నామని మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు.
ఆన్‌లైన్ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించే అంశంపై చర్చ జరగాలని, దీని ద్వారా జవాబుదారీతనం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ నెగెటివిటీని అరికట్టడానికి తగిన ఆధారాలతో చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని ఆయన స్పష్టం చేశారు.