
కెనడా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయడంతో 2026 మొదటి ఆరు నెలల్లోనే 3,323 మంది భారతీయులు డిపోర్టేషన్‌కు గురయ్యారు.
గత ఏడాది మొత్తం పంపించిన వారి సంఖ్యతో పోలిస్తే ఇది 88 శాతానికి సమానమని, ప్రస్తుతం 7,669 మంది భారతీయులు డిపోర్టేషన్ జాబితాలో ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.
వీసా గడువు ముగియడం, నకిలీ పత్రాలు, శరణార్థి దరఖాస్తుల తిరస్కరణ వంటి కారణాలతో కెనడా ఈ కఠిన చర్యలు తీసుకుంటోంది.