
వాల్నట్స్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, పాలిఫెనాల్స్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో మరియు జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
రోజుకు 2 నుంచి 3 వాల్నట్స్ను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం పూట తినడం వల్ల మెదడుతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.
అయితే వాల్నట్స్ కేవలం ఒక ఆహార భాగం మాత్రమేనని, మెదడు ఆరోగ్యానికి సమతుల ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం కూడా ముఖ్యమని నిపుణులు స్పష్టం చేశారు.