
టెక్ దిగ్గజం ఒరాకిల్ వ్యవస్థాపకుడు, చైర్మన్ లారీ ఎల్లిసన్ తన వాటాల విక్రయంపై కీలక నిర్ణయం తీసుకుంటూ గత ప్రణాళికను రద్దు చేసుకున్నారు.
ఒరాకిల్‌లో తనకు ఉన్న 50 మిలియన్ షేర్లను విక్రయించాలని భావించినప్పటికీ, ప్రస్తుతం ఆ షేర్లను విక్రయించే ఉద్దేశం ఆయనకు లేదని కంపెనీ స్పష్టం చేసింది.
ఎల్లిసన్ తన షేర్లను విక్రయించకూడదని తీసుకున్న నిర్ణయం కంపెనీపై ఉన్న ఆర్థిక ఒత్తిడిని కొంతమేర తగ్గించే సంకేతంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.