
యువ హీరో తేజ సజ్జా వచ్చే నెలలో సాఫ్ట్వేర్ ఇంజినీరైన యువతితో నిశ్చితార్థం చేసుకోనుండగా, సాయిధరమ్ తేజ్ తన చిన్ననాటి స్నేహితురాలిని నవంబరులోనే వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.
వీరితో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కూతురు, ఎస్ఆర్హెచ్ యజమాని కావ్య మారన్‌ను వివాహం చేసుకోనున్నారు.
గ్రీస్‌లో వచ్చే నెల 11న ఈ వివాహం జరగనుండగా, నవంబరు 21న చెన్నైలో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.