
ఆగస్టు 14తో ముగిసిన వారానికి భారత విదేశీ మారక నిల్వలు 9.905 బిలియన్ డాలర్లు పెరిగి 716.907 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
విదేశీ కరెన్సీ ఆస్తులు 581.851 బిలియన్ డాలర్లకు, పసిడి నిల్వల విలువ 111.417 బిలియన్ డాలర్లకు పెరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్ద భారత నిల్వలు 5 మిలియన్ డాలర్లు పెరిగి 4.899 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.