
సినీ తారల ఫొటోలు, వీడియో క్లిప్‌లను ఎలాంటి అనుమతి లేకుండా వ్యాపార ప్రయోజనాలకు వాడటంపై నటి ఊర్వశి రౌతేలా టీమ్ సీరియస్ హెచ్చరిక జారీ చేసింది.
లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఓ ఏఐ కంపెనీ తన గుర్తింపును అక్రమంగా వాడుకుంటూ లబ్ధి పొందుతున్నందున రూ. 7,000 కోట్ల పరిహారం డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఏఐ టెక్నాలజీ ద్వారా సెలబ్రిటీల కంటెంట్‌ను అనుమతి లేకుండా వాడుకుంటే తీవ్రమైన న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.