
బొబ్బర్లు (అలసందలు) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఇవి వరం లాంటివని చెబుతున్నారు.
వీటిలో కొవ్వులు, క్యాలరీలు తక్కువగా ఉండి, పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి, జీర్ణశక్తికి తోడ్పడతాయి.
బొబ్బర్లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉండటం వల్ల పోషకాహార లోపంతో వచ్చే వ్యాధులు దరిచేరవు, రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి.