ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 28 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించింది.
అలాగే అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను పరిశీలించడానికి మరో 28 మంది వ్యయ పరిశీలకులను కూడా కేటాయించారు.
ఎన్నికలను సులభతరం చేసేందుకు ఈసారి పోల్ మేనేజ్మెంట్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు.