ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించి ‘ఫైల్ నెం.25’ పేరుతో ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఈ వీడియోలో ప్రభాస్ సైనికుడిగా, ఇండియాలోనే అతి పెద్ద రెబల్ సైనికుడిగా కనిపించనుండగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రస్తావన కూడా ఉంది.
అయితే ఇదే కోవకు చెందిన పీరియడ్ గూఢచారి కథతో నందమూరి కళ్యాణ్ రామ్ మూడేళ్ల క్రితం నటించిన ‘డెవిల్’ సినిమాతో దీనికి పోలికలు వస్తున్నట్లు చర్చ జరుగుతోంది.