
మురసు తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో బుధవారం కూడా ముసురు వాతావరణం ఎడతెరిపి లేకుండా కొనసాగింది.
వర్షాల కారణంగా ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో పాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి.
చింతపల్లిలో 19.9, అరకులోయలో 19.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ వివరాలు వెల్లడించాయి.