
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా చిన్న కుమార్తె అంజనా అర్జున్ తన చిరకాల ప్రేమికుడు ఇసాయ్ను వివాహం చేసుకున్నారు.
అక్టోబర్ 19న జరిగిన ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలను అంజనా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దాదాపు 14 సంవత్సరాల ప్రేమ ప్రయాణం తర్వాత ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.