
భారత్‌లో పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతుండగా, అప్పుడే పుట్టిన వారి నుంచి 14 ఏళ్ల లోపు వారిలో లింఫాటిక్ లుకేమియా సాధారణంగా నమోదవుతోంది.
గత ఐదేళ్లలో దేశంలో ఈ కేసులు 12.8 శాతం పెరిగాయని, ప్రతి ఏటా 50 వేల కంటే ఎక్కువ మంది పిల్లలు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది.
శరీరంలోని కణాల డీఎన్‌ఏలో జరిగే మ్యుటేషన్స్ లేదా మార్పుల వల్ల ఇది వస్తుందని, దీనికి తల్లిదండ్రుల జీవనశైలి కారణం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.