
న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా భారత్ మండపంలో నేతలు 'ఫ్యామిలీ ఫొటో'కు ఫోజిచ్చారు.
ఈ ఫొటోలో ప్రధాని నరేంద్ర మోదీ మధ్యలో ఉండగా.. ఆయనకు ఇరువైపులా రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నిలిచారు.
2019 తర్వాత చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్లో పర్యటిస్తుండగా.. గల్వాన్ ఘర్షణల తర్వాత ఇరు దేశాల సంబంధాలను గాడిలో పెట్టేందుకు ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.