
శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా రెండో రోజు భోజన విరామ సమయానికి 17 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది.
శ్రీలంక ఎలెవన్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 363 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, జడేజా, మానవ్ సుతార్ రెండేసి వికెట్లు తీశారు.
భారత బ్యాటింగ్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా, కేఎల్ రాహుల్ 23 పరుగులతో, దేవదత్ పడిక్కల్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు.