
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాటో కూటమి ఐక్యతను పరీక్షించేందుకు సభ్యదేశంపై సైబర్ దాడులు లేదా పరిమిత స్థాయి సైనిక దాడికి పాల్పడే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి.
ఈ తరహా చర్యలు 2026 నవంబర్ నుంచి 2029 మధ్య ఎప్పుడైనా జరగవచ్చని, అయితే నేరుగా భూదాడి చేసే అవకాశం తక్కువని నివేదిక పేర్కొంది.
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికా వద్ద క్షిపణులు, వాయు రక్షణ ఇంటర్సెప్టర్ల నిల్వలు తగ్గడంపై రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.